మొంథా తుఫాను కారణంగా వినుకొండ నుంచి కొండరాయుడుపాలెం వెళ్లే మార్గంలో గుండ్లకమ్మ నదిపై నిర్మించిన వంతెన పూర్తిగా కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. కొద్దికాలంలోనే వంతెన కూలిపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లోపం వల్లే ఇది జరిగిందని ఆరోపిస్తూ, అధికారులు నాణ్యమైన కొత్త వంతెనను నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.