వినుకొండ పట్టణంలోని 22వ వార్డులో సోమవారం సుమారు 12 అడుగుల పొడవున్న కొండచిలువ కలకలం రేపింది. ఈ కొండచిలువ దాడిలో ఒక పిల్లి ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు తెలిపారు. దీనితో భయభ్రాంతులకు గురైన ప్రజలు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.