నూజెండ్ల: ఆకతాయిల హల్ చల్

నూజెండ్ల మండలంలోని కొండలరాయునిపాలెంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కొందరు యువకులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిని అడ్డుకున్న స్థానిక ప్రభుత్వ ఉపాధ్యాయుడితో మద్యం మత్తులో ఉన్న యువకులు ఘర్షణకు దిగారు. పాఠశాల ప్రధాన గేటు తాళాన్ని పగలగొట్టి ఉపాధ్యాయుడిని భయభ్రాంతులకు గురిచేశారు. ఆకతాయిల ఆగడాలపై పోలీసులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్