వినుకొండ: అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి

వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ విగ్రహం వద్ద బల్లపై పడుకుని ఉన్న 64 ఏళ్ల గంధం రాహేలమ్మ అనే వృద్ధురాలు శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె గుంటూరు జిల్లా, పెదకాకాని గ్రామానికి చెందినదని పోలీసులు గుర్తించారు. ఆమె ఆచూకీ గురించి తెలిసినవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్