వినుకొండ మండలం గోకనకొండ గ్రామానికి చెందిన వంట మాస్టర్ తిరుపతయ్య, వంట పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సంతమాగులూరు సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో ఆయనకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తిరుపతయ్యను సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.