వినుకొండకు చెందిన యువతి, ఈపూరు మండలానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. నవంబర్ 28న ఇంటి నుంచి వెళ్లిపోయిన వారిద్దరూ మనస్తాపంతో ఎలుకల మందు తిన్నారు. ఈ ఘటనలో యువతి చికిత్స పొందుతూ మృతి చెందగా, యువకుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. యువతి తల్లి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.