వినుకొండ పోలీస్ స్టేషన్‌లో మహిళా ఎస్సై ఉదయలక్ష్మి తనపై దాడి చేశారని గోపి అనే యువకుడు ఆరోపించారు. భార్యాభర్తల గొడవలో విచారణకు పిలిచి, తన గుండెలపై కొట్టడమే కాకుండా పొట్టపై తన్నారని బాధితుడు వాపోయారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. తనకు ఊపిరాడటం లేదని, తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.