జూన్ తర్వాతే పంచాయతీ ఎన్నికలు!

AP: జూన్ తర్వాతే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పాలకవర్గాల గడువు ఏప్రిల్ 2తో ముగియనుండగా.. ప్రత్యేక పాలన విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏకసభ్య కమిషన్ నివేదిక, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభానికి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కమిషన్ నివేదిక ఆలస్యమైనా, రిజర్వేషన్ల అంశం కోర్టుకెక్కినా పంచాయతీ ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే ఛాన్సుంది. అటు పరిషత్ ఎన్నికల తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే వాదనలు వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్