తిరుపతిలో 2 విడతల్లోనే పంచాయతీ ఎన్నికలు

AP: రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, తిరుపతి జిల్లాలో మాత్రం రెండు విడతల్లోనే ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) నిర్ణయించింది. డిసెంబరు 4వ తేదీ నుంచి ఏర్పేడు మండలం ఐసర్‌ ప్రాంగణంలో జరగనున్న అఖిల భారత డీజీపీల సదస్సు కారణంగా ఈ మార్పు చేశారు. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రతా సలహాదారులు హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕