AP: తిరుమల శ్రీవారి పరాకామణి కేసులో నిందితుడైన రవికుమార్, తాను చేసిన తప్పును అంగీకరిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. తన ఆస్తిలో 90% శ్రీవారికి రాసిచ్చినట్లు తెలిపారు. కొందరు తనపై తప్పుడు ప్రచారం చేసి, బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. గత కొన్నేళ్లుగా తన కుటుంబం వేధింపులకు గురవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.