AP: పరకామణి చోరీ కేసులో వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. తిరుమల శ్రీవారి పరకామణిలో 920 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ పట్టుబడిన ఉద్యోగి రవిపై 2023 ఏప్రిల్ 7న కేసు నమోదైంది. అప్పట్లో టీటీడీ ఏవీఎస్ఓగా పని చేసిన సతీశ్ కుమార్ ఫిర్యాదు మేరకు తిరుమల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మంగళవారం సా.4 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు.