AP: వైస్సార్ జిల్లా, లింగాల మండలంలో జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నాయకులపై జరుగుతున్న ముందస్తు అరెస్టులను నిరసిస్తూ ఎంపీ అవినాష్ రెడ్డి గారు PS కు చేరుకున్నారు. తమ పార్టీ నాయకులను విడుదల చేసే వరకు స్టేషన్ వద్దే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. బైండోవర్, ఇతర కేసుల పేరుతో తమ నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, కూటమి నేతలు ఎన్నికల్లో అరాచకానికి దిగుతూ బూత్‌లను ఆక్రమించేందుకు కుట్ర చేస్తున్నారని YCP నాయకులు ఆరోపిస్తున్నారు.