AP: టీడీపీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, అమిలినేని సురేంద్ర బాబులపై తోపుదుర్తి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకాలు తీవ్ర స్థాయికి చేరాయని, తనను చంపేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, అమిలినేని సురేంద్ర బాబు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు.