డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 3 రోజుల జైలు శిక్ష

విజయనగరం జిల్లా బొబ్బిలిలో, ట్రాఫిక్ ఎస్.ఐ. చి. నవీన్ పడాల్ వాహనాల తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో కంబారి గంగరాజు మద్యం సేవించి బైక్ నడుపుతున్నట్లు గుర్తించారు. అతన్ని న్యాయస్థానంలో హాజరుపరచగా, ప్రత్యేక న్యాయ ద్వితీయ శ్రేణి మేజిస్ట్రేట్ 3 రోజుల జైలు శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని బొబ్బిలి పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్