పిడుగుపాటుకు 35 గొర్రెలు మృతి.. రూ. 3. 5 లక్షల నష్టం

బొబ్బిలి మండలం నందబాలగ గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు 35 గొర్రెలు మృతి చెందాయి. నీలబోను సూరి, కోరాడ చిన్నరావుకు చెందిన గొర్రెలు మేత మేస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు రూ. 3.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. గొర్రెల పెంపకమే జీవనాధారమైన తమకు ఈ నష్టం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని, అధికారులు వెంటనే పరిశీలించి పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్