బొబ్బిలి జన సేన పార్టీ నుండి 500 బైక్ లతో భారీ ర్యాలీ.

పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ గిరడ. అప్పలస్వామి ఆధ్వర్యంలో బుధవారం 500 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. బొబ్బిలి జనసేన పార్టీ నుండి నాలుగు రోడ్ల వరకు అంగరంగ వైభవంగా జరిగిన ఈ ర్యాలీ అనంతరం కేక్ కటింగ్, వీర మహిళలకు చీరల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా గిరడ. అప్పలస్వామి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాలకు రోడ్లు, కాలువల నిర్మాణం చేపట్టారని తెలిపారు. తెర్లాం జనసేన నాయకులు అక్కివరపు ప్రసాద్, నాలుగు మండలాల నాయకులు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్