నాయుడువలస పాఠశాలలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

బొబ్బిలిలోని నాయుడువలస పాఠశాలలో స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం జె. సి. రాజు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలనకు ఎదురొడ్డి గిరిజనుల హక్కుల కోసం పోరాడిన మహావీరుడు అల్లూరి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్