బొబ్బిలి: 810 కిలోల గంజాయి స్వాధీనం

బొగ్గులోడు మాటున గంజాయి తరలిస్తున్న వాహనాలను రామభద్రపురం పోలీసులు పట్టుకున్నారు. విజయనగరం జిల్లా కొట్టక్కి చెక్ పోస్టు వద్ద గురువారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఒక లారీ, రెండు బొలేరో వాహనాల్లో గంజాయిని ఒడిస్సా రాష్ట్రం నుండి మధ్యప్రదేశ్ కు తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, 810 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా బొబ్బిలి డిఎస్పీ పి. శ్రీనివాసరావు శుక్రవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

సంబంధిత పోస్ట్