రామభద్రపురం గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు మహంతి ధనుంజయ్‌పై ఆ గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త పాశవికంగా దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడడం క్షమించరానిదని ఆ పార్టీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌చార్జి గిరడ అప్పలస్వామి అన్నారు. ఆయన సోమవారం మాట్లాడారు. ధనుంజయ్‌పై దాడి చేసిన నిందితుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ధనుంజయ్‌కు పూర్తిస్ధాయిపూర్తిస్థాయి న్యాయం జరిగేవరకు మద్దతుగా నిలుస్తామని తెలిపారు.