బొబ్బిలి పట్టణంలోని రాజ రాజేశ్వరి సమితి రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తుల పోటెత్తారు. సోమవారం తెల్లవారుజాము నుండి ఆలయ ప్రాంగణం నందు క్యూలో నిలబడి దీపాలు వెలిగించారు. అనంతరం స్వామి వారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలో భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పిల్లలకు సెలవు కావడంతో అధిక సంఖ్యలో దర్శనాలు చేసుకున్నారని అంటున్నారు.