బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీదాడితల్లి కాలనీలో ఓ ప్రైవేట్ స్కూల్ సమీపంలో విద్యుత్ వైర్లు కిందకు వేలాడడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. విద్యుత్ వైర్లు కిందకు వేలాడడంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు.