బొబ్బిలి మండలంలోని ముత్తావలస – కలవరాయి గ్రామాల మధ్య ప్రాంతంలో ఆదివారం అడవి ఏనుగుల గుంపు సంచరిస్తుండటంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలియగానే అటవీ శాఖ అధికారులు, పోలీసు శాఖ అధికారులు వెంటనే స్పందించి అప్రమత్తమయ్యారు. రహదారిలో ప్రజల రాకపోకలను నియంత్రిస్తూ, ప్రమాదాన్ని నివారించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.