పేదలకు నిస్సహాయులకు, పోషణ కష్టమైన కుటుంబాలకు, అనారోగ్య పీడితులకు రోటరీ సభ్యులు చేయూత నందించేలా ముందుకు రావాలని రోటరీ క్లబ్ జిల్లా అధ్యక్షులు జె సి రాజు సబ్యులకు సూచించారు. శనివారం బొబ్బిలి రోటరీ కార్యాలయంలో శ్రీ హరి అధ్యక్షతన క్లబ్ సమావేశం నిర్వహించారు. పేద కుటుంబాలను గుర్తించి వారి జీవన స్థాయి పెంపొందుంచేలా వారి తక్షణ నిత్యావసరాలు సమకూర్చేలా రోటరీ సభ్యులు సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.