బొబ్బిలి ఆర్పీఎఫ్: పార్కింగ్ గొలుసుల తొలగింపుపై ప్రయాణికుల హర్షం

బొబ్బిలి రైల్వే స్టేషన్ ఆవరణలో పార్కింగ్ విషయంలో లోకల్ యాప్ లో ప్రచురితమైన 'బొబ్బిలి ఆర్పిఎఫ్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు' కథనానికి ఆర్పీఎఫ్ స్పెక్టర్ స్పందించారు. మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవళ్ళ కిరణ్ కుమార్, టౌన్ టిడిపి అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో, స్టేషన్ ముందు ఒక లైన్ నిర్మించామని, ఆ లైన్ ఆవల ప్రయాణికులను డ్రాప్ చేయడానికి వచ్చేవారు వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇకపై ఎవరి వాహనాలకు గొలుసులు వేయడం జరగదని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంపై పలువురు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్