బొబ్బిలి: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వంశీ మృతి

ఈనెల 4న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వంశీ విజయనగరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. బొబ్బిలి రైల్వే ఫ్లైఓవర్ వద్ద రెండు బైకులు ఢీకొని ముగ్గురు గాయపడగా వారిలో గున్నతోటవలసకు చెందిన వంశీకి తీవ్ర గాయాలయ్యాయి. అతని మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్