బొబ్బిలి -పార్వతీపురం జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. సోమవారం సాయంత్రం బొబ్బిలి పట్టణం పరిధిలో తారక రామా కాలనీ ఎదురుగా జరిగింది. సాల లక్ష్మి(56) అనే మహిళ గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. వాకింగ్ చేస్టున్న సందర్బంగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.