బొబ్బిలి ఫ్లైఓవర్‌పై రన్నింగ్‌లో ఉన్న ఓ కారులో శనివారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన సీఐ నారాయణరావు ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. మంటలు అదుపులోకి వచ్చేలా చర్యలు తీసుకోవడంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.