విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామంలో ఆదివారం స్వచ్ఛ రథం ద్వారా పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. దసరా సందర్భంగా నిర్వహిస్తున్న లక్కీ డ్రా గురించి ప్రజలకు వివరించారు. స్వచ్ఛ రథానికి ఎక్కువగా పొడి వ్యర్థాలను అందించే వారికి బహుమతులు అందజేస్తామని ఎంపీడీవో రవికుమార్ తెలిపారు. అలాగే వారంలో అత్యధికంగా పొడి వ్యర్థాలు అందించిన వారికి ప్రత్యేక బహుమతులు ఇస్తామని ప్రకటించారు. ప్రజలు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.