జాతీయ పోటీలకు కోచింగ్ క్యాంప్

13వ సబ్‌ జూనియర్ ఆంధ్రప్రదేశ్ జట్టు జాతీయస్థాయి పోటీలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పారాది ఉన్నత పాఠశాలలో వారం రోజుల కోచింగ్ క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున జట్టు పాల్గొననుంది. కడప, విశాఖ, గుంటూరు, విజయనగరం, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల నుంచి క్రీడాకారులు ఎంపికయ్యారు. టీమ్ కోఆర్డినేషన్, శిక్షణ కోసం క్యాంప్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి బేబీనాయన, భాస్కరరావు, సాయిరమేష్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా, ప్రధానోపాధ్యాయులు, వార్డెన్ సహకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕