పట్టణ పారిశుధ్యంపై కమిషనర్ పరిశీలన

బొబ్బిలి పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై కమిషనర్ ఎల్. రామలక్ష్మి మంగళవారం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. కోరాడ వీధి, పాకివీధి స్మశాన వాటిక ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. రోడ్ల వెంబడి బెర్ములు, కాలువల్లోని పిచ్చిమొక్కలు తొలగించాలని, ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఆదేశించారు. ప్లాస్టిక్‌పై ప్రతిరోజూ దాడులు నిర్వహించి జరిమానాలు విధించాలని సూచించారు. సురక్షిత తాగునీరు, క్లోరినేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕