సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

విజయనగరం, బొబ్బిలిలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ముగ్గురు లబ్ధిదారులకు రూ. 2,45,832 ఆర్థిక సాయం అందేలా ఎమ్మెల్యే ఆర్.వి.ఎస్.కే.కే. రంగారావు (బేబీనాయన) కృషి చేశారు. బొబ్బిలి కోటలో ఆయన చెక్కులను అందజేశారు. అనంతరం బొబ్బిలి కళాభారతిలో ఎంపీడీవో కార్యాలయ ఏఎస్‌ఓ డి.వి. అప్పారావు, బూసాయవలసలో జెడ్పీ హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్ గోర్జ కృష్ణారావు పదవీవిరమణ కార్యక్రమాల్లో పాల్గొని వారి సేవలను అభినందించారు. ప్రజాసేవలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని, పదవీవిరమణ అనంతరం కూడా సమాజానికి సేవలందించాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్