బొబ్బిలి పట్టణంలో నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సరఫరాలో ఇబ్బందులు ఉంటే ముందుగానే ప్రజలకు సమాచారం ఇవ్వాలని, ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.