విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కూనాయ వలస గ్రామంలో ఆదివారం ఫోలియో వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి మోతి దాసు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఒక చిన్నారికి ఫోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలోని ప్రతి చిన్నారికి ఫోలియో వ్యాక్సిన్ వేయడం ద్వారా బాల్యంలోనే అంగవైకల్యాన్ని నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.