బొబ్బిలి మండలం పక్కి గ్రామానికి చెందిన అమరాపు గీతిక రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో అండర్-19, అండర్-21 విభాగాల్లో రెండు స్వర్ణ, రెండు రజత పతకాలు సాధించింది. ఈ సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు (బేబీనాయన) బొబ్బిలిలో ఆమెను సత్కరించారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి బొబ్బిలి, జిల్లా, రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.