జీవో 673 రద్దు చేయాలి.. సీఐటీయూ

విజయనగరం, బొబ్బిలిలోని వేణుగోపాలస్వామి సెంటర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు ఆదివారం నిరసన చేపట్టారు. వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్, పార్కులు, శానిటేషన్ వంటి 14 కీలక పౌర సేవలను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించే జీవో 673ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పి. శంకర్రావు మాట్లాడుతూ ప్రైవేటీకరణతో ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕