బొబ్బిలిలో ఎన్టీఆర్ బొమ్మ సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేసి, ఓటర్ల జాబితా నుంచి తొలగించిన అర్హులైన ఓటర్ల హక్కును పునరుద్ధరించాలని కోరారు. ఎన్నికల సంఘం స్వతంత్రత, విశ్వసనీయతను కాపాడాలని, ఎన్నికల కమిషనర్ల నియామక విధానంలో మార్పులు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పి. శంకర్రావు, మునకాల శ్రీను, వి. రామ్మూర్తి, సింగిరెడ్డి గోపాలు తదితరులు పాల్గొన్నారు.