బొబ్బిలిలోని కోటిపల్లి మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ‘ప్రాథమిక విద్య–అక్షరాస్యత’పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ జె. సి. రాజు మాట్లాడుతూ, విద్య ద్వారానే జ్ఞాన సముపార్జన, తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు జీవిత విలువలు, సేవా గుణాన్ని అలవర్చుకోవాలని, తల్లిదండ్రులను గౌరవించాలని ఆయన సూచించారు. పాఠశాలలో తరగతి గదుల్లో వెలుతురు కోసం 25 ఎల్ఈడీ ట్యూబ్లైట్లను రోటరీ క్లబ్ అందజేసింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ భార్గవి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.