లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే

విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం ఎం. బూర్జవలస సచివాలయ పరిధిలోని గున్నతోటవలస గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే  రంగారావు (బేబీ నాయన) సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్నిబుధవారం ప్రారంభించి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్