విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గంలో భారీ వర్షాల వల్ల ముంపునకు గురైన ప్రాంతాలపై ఎమ్మెల్యే బేబీనాయన ఇరిగేషన్ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. గత వారం ముంపు ప్రాంతాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించగా, అధికారులు పర్యటించి ముంపు ప్రాంతాల వివరాలతో నివేదికను, సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలను రూపొందించారు. ఈ నివేదికను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు స్వయంగా అందజేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.