పల్స్ పోలియో కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్

జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి పాల్గొన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలియో రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్