బొబ్బిలిలో నూతన అగ్నిమాపక కేంద్రం

బొబ్బిలి నియోజకవర్గంలో రూ. 1. 25 కోట్లతో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన నూతన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కె. కె. రంగారావు (బేబీనాయన) విజయనగరం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, జిల్లా కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕