రేపు బొబ్బిలిలో మాజీ సైనికుల అవుట్ రీచ్ ప్రోగ్రామ్

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం బొబ్బిలి పాత కోటలో మాజీ సైనికులు, వారి కుటుంబాల కోసం అవుట్ రీచ్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు. ​ఈకార్యక్రమంలో భాగంగా సైనికుల సంక్షేమ పథకాలు, స్పర్శ్/పెన్షన్ సమస్యల పరిష్కారం, లైఫ్ సర్టిఫికేట్లు, గుర్తింపు కార్డులు, డిపెండెంట్ కార్డుల తక్షణ జారీ, పార్ట్-2 ఆర్డర్లు, పిఎంఎస్ఎస్ పై మార్గదర్శనం చేయనున్నారు. ​అలాగే, 75 ఏళ్ల వయోవృద్ధులను, అనారోగ్యంతో ఉన్న వారు స్వయంగా పరామర్శించి సమస్యలు తెలుసుకుంటారని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల సైనిక సంక్షేమ అధికారి కె. వి. ఎస్ ప్రసాద్ తెలిపారు. మాజీ సైనికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు

సంబంధిత పోస్ట్

✕
✕