తుఫాను వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆర్నాబ్ తుఫాను ప్రభావం నేపథ్యంలో బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట గ్రామంలో ఎంపీడీవో రవికుమార్ ప్రజలకు పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని, తాగునీటిని వేడి చేసుకుని మాత్రమే వినియోగించాలని సూచించారు. తుఫాను సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో మౌళి, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕