విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక సంఘం ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాంబర్కి రేణుక దేవి స్వప్న 5184 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన మరియు తెంటు లక్ష్మనాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఓటర్లందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. చైర్మన్ పదవి చేపట్టడం తనకు దక్కిన అదృష్టమని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని మంగళవారం ఆమె మీడియాకు వెల్లడించారు. ఈ విజయం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.