బొబ్బిలి కంటి ఆసుపత్రి నూతన భవనంలో ఆధ్యాత్మిక పూజలు

విజయనగరం జిల్లా బొబ్బిలిలో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ఆగస్టులో ప్రారంభంకానున్న కంటి ఆసుపత్రి నూతన భవనంలో ఆదివారం ఆధ్యాత్మిక పూజలు నిర్వహించారు. ప్రముఖ కంటి వైద్య నిపుణులు డా. కోటగిరి అప్పారావు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే ఆర్. వి. ఎస్. కె. కె. రంగారావు (బేబీ నాయన) పూజల్లో పాల్గొని, ఆసుపత్రి ప్రజలకు విజయవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు అల్లాడ భాస్కరరావు, డా. గేదెల శశిభూషణ్, మాజీ కౌన్సిలర్ జలగం వెంగళరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్