ఆరికతోట శివాలయంలో శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు!

విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం ఆరికతోట గ్రామంలోని శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 6: 20 గంటల మధ్య ఉదయించిన సూర్యకిరణాలు నేరుగా ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి శివలింగాన్ని తాకాయి. ఈ అపురూప దృశ్యాన్ని భక్తులు సూర్యాభిషేకంగా భావిస్తున్నారు.ప్రతి సంవత్సరం ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో ఈ విధంగా సూర్యకిరణాలు స్వామివారిని తాకడం ఆలయ ప్రత్యేకతగా నిలుస్తోంది. గ్రామ పెద్దల కథనం ప్రకారం ఈ ఆలయం సుమారు 300 నుంచి 350 సంవత్సరాల పురాతనమైనది.

సంబంధిత పోస్ట్

✕
✕