విజయనగరం బొబ్బిలిలో శనివారం విద్యాశాఖ, భవిత కేంద్రం ఆధ్వర్యంలో రోటేరియన్ పువ్వుల కృష్ణమోహన్‌కు ఘన సన్మానం జరిగింది. 24 ఏళ్లుగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఆయన అందించిన సేవలకు గాను ఈ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రమేష్, రోటరీ అధ్యక్షులు, కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ జె. సి. రాజు పాల్గొని కృష్ణమోహన్ సేవలను ప్రశంసించారు. అనంతరం కృష్ణమోహన్ దంపతులను వివిధ సంస్థల ప్రతినిధులు సత్కరించారు.