విషాదం.. టబ్ లో పడి చిన్నారి మృతి

బొబ్బిలి మండలం కారాడ గ్రామంలో 18 నెలల చిన్నారి సుబరి మానస నీటితో నింపిన టబ్‌లో పడి మృతి చెందింది. ఒడిశా నుంచి వలస వచ్చి పామాయిల్ తోటలో వలస వచ్చి కూలీ పనులు చేస్తున్న సుబరి దంపతుల మూడో (చిన్న) కుమార్తె అయిన మానస శనివారం రాత్రి తల్లిదండ్రులు ఇంట్లో ఫ్యాన్ రిపేర్ చేస్తుండగా ఆడుకుంటూ టబ్‌లో పడిపోయింది. ఆమె కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా టబ్‌లో అపస్మారక స్థితిలో ఉంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్