బొబ్బిలి మండల కేంద్రంలోని అభ్యుదయ ప్రైవేట్ స్కూల్లో విషాదం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న సుందరాడ కార్తికేయ (14) అనే విద్యార్థి మృతి చెందాడు. ఇద్దరు విద్యార్దులు మధ్య జరిగిన కొట్లాట కారణంగా మృతి చెందినట్టు తెలుస్తుంది. మృతి చెందిన విద్యార్థి బొబ్బిలిలోని రావు గారి వీధికి చెందినట్టు గుర్తించారు. బొబ్బిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.