ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసిన జడ్పీటీసీ సభ్యురాలు

విజయనగరం జిల్లా, చీపురుపల్లిలో ఆదివారం కర్లాం పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో ఐదేళ్లలోపు చిన్నారులకు జడ్పీటీసీ సభ్యురాలు వలిరెడ్డి శిరీష, వైఎస్సార్సీపీ జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు పోలియో చుక్కలు వేశారు. పోలియో నిర్మూలనలో తల్లిదండ్రుల బాధ్యతను గుర్తుచేస్తూ, ప్రతి చిన్నారికి రెండు చుక్కలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. 'జీవితానికి రెండు చుక్కలు' అనే సందేశంతో పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్